హైదరాబాద్: 28°C
వార్తలు

నేడు తెనాలిలో సీఎం చంద్రబాబు పర్యటన

AP: సీఎం చంద్రబాబు ఇవాళ గుంటూరు(D) తెనాలిలో పర్యటించనున్నారు. బుర్రిపాలెంలో 3 లక్షల ఇళ్ల నిర్మాణానికి కేంద్రమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌తో కలిసి ఆయన శంకుస్థాపన చేయనున్నారు. రూరల్ హౌసింగ్‌లో భాగంగా రాష్ట్రంలోనే తొలిసారిగా చేపడుతున్న 3డీ కాంక్రీట్ ప్రింటింగ్ ఇళ్ల ప్రాజెక్టును పరిశీలించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా లబ్ధిదారులతో సమావేశమై, బహిరంగ సభలో ప్రసంగించనున్నారు.