SRCL: బోయిన్ పల్లి తహసీల్దార్ కార్యాలయంలో వసతుల కొరత నెలకొంది. 2012లో రూ.17.25 లక్షలతో నిర్మించిన నాలుగు గదుల భవనంలో తహసీల్దార్, డిప్యూటీ తహసీల్దార్ సహా 10 మంది సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. స్థలం సరిపోక కార్యాలయం పైభాగంలో రేకులతో తాత్కాలిక గదిని ఏర్పాటు చేశారు. వర్షం కురిసినపుడు గదిలో నీరు కారుతోందని ఉద్యోగులు వాపోతున్నారు.
తెలంగాణ
బోయిన్‌పల్లి తహసీల్దార్ కార్యాలయంలో వసతుల కొరత


