ఇండోనేషియాలో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై దీని తీవ్రత 5.2గా నమోదైనట్లు సంబంధిత అధికారులు వెల్లడించారు. భూ ఉపరితలం నుంచి 10 కిలోమీటర్ల లోతులో దీని కేంద్రాన్ని గుర్తించారు. ప్రకంపనలతో భయపడిన ప్రజలు ఇళ్ల నుంచి రోడ్లపైకి పరుగులు తీశారు. ఇప్పటివరకు ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదని, సునామీ ముప్పు లేదని అధికారులు స్పష్టం చేశారు.
క్రైమ్
ఇండోనేషియాలో భూకంపం


