JN: పాలకుర్తి నియోజకవర్గంలోని 132 మంది లబ్ధిదారులకు రూ.1.32 కోట్ల విలువైన కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి సోమవారం పంపిణీ చేశారు. తొర్రూరు, పెద్దవంగర, రాయపర్తి మండలాలకు చెందిన లబ్ధిదారులకు చెక్కులు అందజేశారు. పేద కుటుంబాలకు సంక్షేమ పథకాల ద్వారా ప్రభుత్వం అండగా నిలుస్తోందని ఎమ్మెల్యే తెలిపారు.
తెలంగాణ
132 మందికి రూ.1.32 కోట్ల కళ్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ


