ASF: జాతీయ వన్యప్రాణి వారోత్సవాల్లో భాగంగా పెంచికల్పేట్ అటవీ రేంజ్ పరిధిలో సోమవారం బైక్ ర్యాలీ నిర్వహించారు. అటవీశాఖ సిబ్బంది, అనిమల్ ట్రాకర్లు బొంబాయిగూడ, ఎల్కపల్లి, ఎల్లూర్, లోడ్పల్లి గ్రామాల్లో ర్యాలీ సాగింది. ప్రజలకు అడవులు, వన్యప్రాణుల సంరక్షణపై అవగాహన కల్పించారు. పర్యావరణ సమతుల్యతకు అడవులు, వన్యప్రాణులు కీలకమని అధికారులు తెలిపారు.
తెలంగాణ
వన్యప్రాణి వారోత్సవాల్లో బైక్ ర్యాలీ


