హైదరాబాద్: 28°C
తెలంగాణ

కొత్త కలెక్టరేట్‌లో సీలింగ్ ఊడిపడలేదు: కలెక్టర్

KNR: కొత్త కలెక్టరేట్‌లో సీలింగ్‌ ఊడిపడిందంటూ సోషల్‌ మీడియాలో ప్రసారమవుతున్న వార్తలను కలెక్టరేట్‌ అధికారులు ఖండించారు. సోషల్‌ మీడియాలో చూపిస్తున్న దృశ్యాలు పాత కలెక్టరేట్‌ ఆడిటోరియానికి సంబంధించినవని స్పష్టం చేశారు. ఆ దృశ్యాలు కొత్త కలెక్టరేట్‌కు సంబంధించినవి కావని తెలిపారు.