MNCL: చెన్నూర్ మండలం ఆస్నాద్ గ్రామంలో అక్రమ బెల్ట్ షాపులను వెంటనే మూసివేయాలని యువకులు, గ్రామస్థులు డిమాండ్ చేశారు. సోమవారం ఎక్సైజ్ అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు. గ్రామంలో బెల్ట్ షాపుల నిర్వహణను అడ్డుకోవాలని కోరారు. అధికారులు స్పందించకపోతే ఎక్సైజ్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు.
తెలంగాణ
బెల్ట్ షాపులు మూసివేయాలని నిరసన


