వాంకోవర్ యాంకర్స్‌తో జరిగిన కెనడా సూపర్ 60 సీజన్-2 ఫైనల్లో టొరంటో సిక్సర్స్ ప్లేయర్ నికోలస్ పూరన్ సిక్సర్లతో చెలరేగాడు. 23 బంతుల్లో 2 ఫోర్లు, 9 సిక్సర్ల సాయంతో 67 పరుగులు చేశాడు. దీంతో 164 పరుగుల లక్ష్యాన్ని టొరంటో చివరి బంతికి ఛేదించి.. టైటిల్‌ను కైవసం చేసుకుంది. కాగా, మహిళల విభాగంలోనూ టొరంటో జట్టు విజేతగా నిలిచింది.
క్రీడలు
సిక్సర్ల మోత మోగించిన పూరన్


