VSP: టీబీ రహిత సమాజ నిర్మాణానికి అందరూ కృషి చేయాలని ఏయూ వీసీ ఆచార్య జి.పి. రాజశేఖర్ అన్నారు. ఈ సందర్భంగా సోమవారం ఏయూలో టీబీ రహిత భారత్ పోస్టర్‌ను ఆవిష్కరించారు. టీబీపై అవగాహనలో భాగంగా ఈ నెల 7, 8, 9వ తేదీల్లో ఏయూలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏయూ వైద్యాధికారి డాక్టర్ జి.ఏ.వి. రామేశ్వర్, ఇతర వైద్యులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
'టీబీ రహిత సమాజమే లక్ష్యం'


