హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

బీసీలకు 50% రిజర్వేషన్ కల్పించాలి: బీఎస్పీ

కోనసీమ: బీసీలకు స్థానిక సంస్థల్లో 50 శాతం రిజర్వేషన్లు కల్పించిన తర్వాతే ఎన్నికలు నిర్వహించాలని బహుజన్ సమాజ్ పార్టీ డిమాండ్ చేసింది. ముమ్మిడివరం అంబేద్కర్ భవన్‌ లో సోమవారం జరిగిన నియోజకవర్గ సమావేశంలో ఈ మేరకు తీర్మానించారు. 50 శాతం రిజర్వేషన్లకు రాజ్యాంగపరమైన రక్షణ కల్పించేందుకు కేంద్రంపై రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి తీసుకురావాలని కోరారు.