హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పెండింగ్ అర్జీలు సత్వరమే పరిష్కరించాలి: కలెక్టర్

W.G: పీజీఆర్ఎస్, రెవెన్యూ క్లినిక్ ఫిర్యాదులను పెండింగ్‌ లేకుండా సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అధికారులను ఆదేశించారు. సోమవారం భీమవరం కలెక్టరేట్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ఆమె ప్రజల నుంచి 159 పీజీఆర్ఎస్, 38 రెవెన్యూ క్లినిక్ అర్జీలను స్వీకరించారు. అర్జీల పరిష్కారంలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.