హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

బైండోవర్ నిబంధనలు ఉల్లంఘించిన వ్యక్తికి జరిమానా

W.G: బైండోవర్‌ నిబంధనలను ఉల్లంఘించి తిరిగి బెల్ట్‌ షాపు నిర్వహిస్తున్న వ్యక్తికి తణుకు తహసీల్దార్‌ వర్మ రూ.30 వేల జరిమానా విధించారు. తణుకు మండలం తేతలికి చెందిన పంది గోగులు బెల్ట్‌ షాపు నిర్వహిస్తున్నట్లు గుర్తించి గతంలో తీసుకున్న బైండోవర్‌ చర్యలను ఉల్లంఘించిన నేపథ్యంలో జరిమానా విధించారు. ఎక్సైజ్‌ సీఐ మణికంఠరెడ్డి నిందితుడిని తాహసీల్దార్ ఎదుట హాజరు పచారు.