హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అంతర్జాతీయ కరాటే టోర్నీకి ఆదోని విద్యార్థి

KRNL: పుణేలో ఈ నెల 10న జరగనున్న 8వ ఇంటర్నేషనల్ కరాటే టోర్నీకి ఆదోని మండలం పర్వతాపురానికి చెందిన బీటెక్ విద్యార్థి కార్తీక్(22) ఎంపికయ్యాడు. 14 దేశాల క్రీడాకారులు పాల్గొనే పోటీల్లో భారత్ తరఫున ఏకైక క్రీడాకారుడిగా కార్తీక్ బరిలోకి దిగనున్నారు. ఆటో డ్రైవర్ గోవిందు కుమారుడైన కార్తీక్ ఎంపిక పట్ల గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు.