హైదరాబాద్: 28°C
తెలంగాణ

ప్రజావాణికి నాలుగు దరఖాస్తులు

NZB: మండల పరిషత్ కేంద్రంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి మొత్తం నాలుగు దరఖాస్తులు వచ్చాయని ఎంపీడీవో ఉదయ్ భాస్కర్ తెలిపారు; ఇందులో రెవెన్యూ రంగానికి సంబంధించి రెండు, పంచాయతీరాజ్ మరియు జాతీయ రహదారుల శాఖలకు ఒక్కొక్కటి చొప్పున వినతులు అందగా, వాటిని వెంటనే సంబంధిత శాఖల అధికారులకు పంపించి త్వరితగతిన సమస్యలను పరిష్కరించేందుకు తగిన చర్యలు తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు.