KDP: లింగాల మండలానికి 1,200 క్వింటాళ్ల జేజీ-11 రకం శనగ విత్తనాలు మంజూరయ్యాయని ఏఓ రమేశ్ తెలిపారు. మంగళవారం నుంచి రైతుల నమోదు ప్రక్రియ ప్రారంభమవుతుందన్నారు. ఎకరాకు 40 కిలోలు చొప్పున, గరిష్ఠంగా 200 కిలోల వరకు విత్తనాలు అందిస్తామని చెప్పారు. రైతులు ఆధార్, పట్టాదారు పాసుపుస్తకంతో రైతు సేవా కేంద్రాల్లో నమోదు చేసుకోవాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
లింగాలకు 1,200 క్వింటాళ్ల శనగ విత్తనాలు


