హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పల్లె పండుగతో గ్రామాల అభివృద్ధి: ఎమ్మెల్యే

కోనసీమ: అయినవిల్లి మండలంలో ‘పల్లె పండుగ 3.0’లో భాగంగా పలు అభివృద్ధి పనులకు పి.గన్నవరం ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ శంకుస్థాపన చేశారు. సనబోయినివారిపేట, విలాస గ్రామాల్లో మొత్తం రూ.40 లక్షలతో నిర్మించనున్న సీసీ రోడ్డు పనులకు శ్రీకారం చుట్టారు. నియోజకవర్గానికి 41 పనులకు రూ.4.30 కోట్ల నిధులు మంజూరయ్యాయని ఎమ్మెల్యే తెలిపారు.