హైదరాబాద్: 28°C
తెలంగాణ

కలెక్టరేట్ ప్రజావాణిలో 107 ఫిర్యాదులు

NZB: కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి మొత్తం 107 ఫిర్యాదులు అందాయి. తమ సమస్యలను అదనపు కలెక్టర్ భుజంగరావు, డీఆర్‌వో గీత, జెడ్పీ సీఈవో సాయాగౌడ్, డీఆర్డీవో సాయన్న, డీపీవో శ్రీనివాస్‌రావు, నగర పాలక సంస్థ అదనపు కమిషనర్ చంద్రశేఖర్‌లకు వివరించి అర్జీలు సమర్పించారు. ఫిర్యాదులను పరిశీలించి సంబంధిత శాఖల అధికారులు పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.