హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఉంద్యాలలో అభివృద్ధి పనులకు శ్రీకారం

MBNR: చిన్నచింతకుంట మండలం ఉంద్యాల గ్రామంలో రూ.30 లక్షలతో నిర్మించిన నూతన జెడ్పీహెచ్‌ఎస్ పాఠశాల భవనాన్ని ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి ప్రారంభించారు. రూ.20 లక్షలతో హెల్త్ సబ్‌సెంటర్, రూ.32.50 లక్షలతో సీసీ రోడ్లు, కాంపౌండ్ వాల్ పనులకు శంకుస్థాపన చేశారు. అభివృద్ధి పనులను వేగంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.