SDPT: అక్కన్నపేట మండలం కేశవాపూర్ గ్రామంలో భూ భారతి రీ-సర్వేను జిల్లా కలెక్టర్ కె. హైమావతి సోమవారం పరిశీలించారు. రీ-సర్వేను పారదర్శకంగా, ఖచ్చితత్వంతో చేపట్టాలని అధికారులను ఆదేశించారు. భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం కోసం ప్రభుత్వం ఈ ప్రక్రియ చేపట్టిందని తెలిపారు. సర్వే వేగవంతం చేసేందుకు అధునాతన రోవర్ యంత్రాలు కొనుగోలు చేస్తున్నట్లు వెల్లడించారు.
తెలంగాణ
భూ భారతి రీ-సర్వే పరిశీలన


