హైదరాబాద్: 28°C
తెలంగాణ

జుక్కల్ అభివృద్ధిపై ఖర్గేతో ఎమ్మెల్యే

KMR: జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు సోమవారం న్యూ ఢిల్లీలోని ఇందిరా భవన్లో AICC అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గేను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నియోజకవర్గ అభివృద్ధి, ప్రజా సమస్యలు, సామాజిక న్యాయం, పార్టీ కార్యక్రమాలపై చర్చించారు. కాంగ్రెస్ పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేయడం, అభివృద్ధి పనులపై కూడా చర్చించినట్లు తెలిపారు.