హైదరాబాద్: 28°C
తెలంగాణ

వృద్ధాప్యంలో కుమారుల నుంచే బెదిరింపులు

SRPT : వృద్ధాప్యంలో కుమారుల నుంచే బెదిరింపులు, మానసిక వేధింపులు ఎదురవుతున్నాయని మోతె మండలం విభళాపురం గ్రామానికి చెందిన నిమ్మల అచ్చమ్మ ఆరోపించారు. ఈ మేరకు సోమవారం కలెక్టర్ తేజస్ నందన్‌లాల్ పవార్‌కు ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. భర్త మృతి అనంతరం కుటుంబ వివాదాలు కొనసాగుతున్నాయని, కుమారులు శ్రీను, శేషగిరి, వెంకన్న నుంచి రక్షణ కల్పించాలని కోరారు.