హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పట్టాలు ఇవ్వాలని వినతి పత్రం

AKP: రోలుగుంట మండలం అడ్డసారం గ్రామంలో సాగులో ఉన్న ఎస్సీ రెల్లి కులస్తుల రైతులకు సాగు భూముల పట్టాలు ఇవ్వాలని రాష్ట్ర రెల్లి హక్కుల సంఘం అధ్యక్షుడు ఎర్రంశెట్టి పాపారావు సోమవారం PGRSలో వినతిపత్రం అందజేశారు. సర్వే నెంబర్ 243లో గత 15 సంవత్సరాలుగా రైతులు సాగు చేసుకుంటున్నారని వినతి పత్రంలో పేర్కొన్నారు. ఇప్పటికైనా రెవెన్యూ అధికారులు స్పందించాలని కోరారు.