PLD: వెల్దుర్తి మండలంలో వరికపూడిశెల ప్రాజెక్ట్ భూసేకరణ పనులు ఊపందుకున్నాయి. సిరిగిరిపాడు, గుండ్లపాడు, మండాది తదితర గ్రామాల్లో 72 ఎకరాల హద్దుల గుర్తింపు (పెగ్ మార్కింగ్) పనులను తహసీల్దార్, రెవెన్యూ అధికారులు మొదలుపెట్టారు. మండలంలో మొత్తం 170 ఎకరాలు సేకరించాల్సి ఉందని, పనులు వేగవంతం చేస్తున్నామని నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
వరికపూడిశెల ప్రాజెక్ట్ పెగ్ మార్కింగ్ పనులు ప్రారంభం


