హైదరాబాద్: 28°C
తెలంగాణ

మేడ్చల్ ఆస్పత్రిలో సమయపాలన ఏదీ?

MDCL: కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌లో సిబ్బంది సమయపాలనపై రోగులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. నిర్ణీత సమయానికి వైద్యులు, సిబ్బంది అందుబాటులో లేకపోవడంతో చికిత్స కోసం వచ్చిన రోగులు గంటల తరబడి నిరీక్షించాల్సి వస్తోందని చెబుతున్నారు. ప్రభుత్వ వైద్య సేవలపై ఆధారపడే పేదలకు ఇబ్బందులు కలగకుండా అధికారులు క్రమం తప్పకుండా తనిఖీలు నిర్వహించాలని రోగులు కోరుతున్నారు.