హైదరాబాద్: 28°C
తెలంగాణ

ప్రజావాణి అర్జీల పరిష్కారంపై కలెక్టర్ ఆదేశాలు

GDWL: ప్రజావాణి అర్జీలను పెండింగ్‌లో ఉంచకుండా ఎప్పటికప్పుడు పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అధికారులను ఆదేశించారు. సోమవారం ఐడీఓసీ సమావేశ మందిరంలో ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. ఈ వారం 44 ఫిర్యాదులు అందగా, వివిధ శాఖలకు సంబంధించి మొత్తం 94 అర్జీలు పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు. వాటిని త్వరితగతిన పరిష్కరించాలని సూచించారు.