హైదరాబాద్: 28°C
క్రీడలు

U-19 టెస్ట్: 174 పరుగులకే ఆసీస్ ఆలౌట్

ఆస్ట్రేలియా అండర్-19 జట్టుతో జరుగుతున్న రెండో అనధికారిక టెస్ట్‌లో భారత బౌలర్లు చెలరేగారు. దీంతో ఆసీస్ తొలి ఇన్నింగ్స్‌లో 174 పరుగులకే ఆలౌటైంది. స్పిన్నర్ తన్మయ్ 6 వికెట్లతో ఆసీస్ పతనాన్ని శాసించాడు. అయాన్ అక్రమ్ 2, మోహిత్, ప్రియాన్షు సింగ్ తలో వికెట్ తీశారు. ఆసీస్ తరఫున 37 పరుగులతో చార్లీ హెండర్సన్ టాప్ స్కోరర్‌గా నిలిచాడు.