హైదరాబాద్: 28°C
తెలంగాణ

సీసీ రోడ్లు ప్రారంభించిన ఎమ్మెల్యే

RR: ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి పోల్కంపల్లిలో రూ.50 లక్షల వ్యయంతో నిర్మించిన సీసీ రోడ్లను ప్రారంభించారు. ఈ సందర్భంగా గ్రామస్థులు తమ సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లగా, ఆయన వెంటనే అధికారులతో మాట్లాడి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రజా సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించడమే ప్రజా పాలన లక్ష్యమని ఎమ్మెల్యే పేర్కొన్నారు.