హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఈపురుపాలెంలో అంగన్వాడీ ఉత్సవం

BPT: ప్రధాని మోదీ 25 ఏళ్ల ప్రజాసేవా ప్రస్థానం సందర్భంగా నిర్వహిస్తున్న 'సేవా సంకల్ప అభియాన్'లో భాగంగా ఈపురుపాలెంలో అంగన్వాడీ ఉత్సవం జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన చీరాల ఎమ్మెల్యే మాలకొండయ్య అంగన్వాడీ కేంద్రాన్ని పరిశీలించి చిన్నారుల పౌష్టికాహారం, విద్యా సదుపాయాలపై ఆరా తీశారు. నిస్వార్థంగా సేవలందిస్తున్న అంగన్వాడీ టీచర్లు, ఆశా వర్కర్లను ఘనంగా సత్కరించారు.