హైదరాబాద్: 28°C
తెలంగాణ

వన్యప్రాణుల వేటగాడు అరెస్ట్

ADB: అడవి జంతువులను వేటాడి మాంసం, కొమ్ములు విక్రయిస్తున్న షోయబ్ అఫ్జల్‌ను అరెస్ట్ చేసినట్లు SP అఖిల్ మహాజన్ సోమవారం తెలిపారు. గత ఏడాది నుంచి పరారీలో ఉన్న నిందితుడి వద్ద నుంచి మోటార్ సైకిల్, సెల్‌ఫోన్ స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. వన్యప్రాణుల వేట చట్టరీత్యా నేరమని, కఠిన చర్యలుంటాయని ఎస్పీ అఖిల్ మహాజన్ హెచ్చరించారు.