హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వన్యప్రాణుల పరిరక్షణపై అవగాహన

VSP: వన్యప్రాణి వారోత్సవాలను విజయవంతం చేయాలని గ్రీన్ క్లైమేట్ టీం ఎన్జీవో వ్యవస్థాపక కార్యదర్శి జె.వి. రత్నం కోరారు. ఎంవీపీ కాలనీలోని సమతా డిగ్రీ కళాశాలలో సోమవారం నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా జీవరాశుల పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు. అడవుల నరికివేత, అక్రమ వేటను అరికట్టి వన్యప్రాణుల ఆవాసాలను కాపాడాలని సూచించారు.