హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఎంఆర్సీలో ప్రపంచ ఉపాధ్యాయ దినోత్సవం

NZB: అంతర్జాతీయ ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని భీమగల్ మండల విద్యా వనరుల కేంద్రం (MRC)లో ట్రాస్మా ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంఈఓ డి. స్వామి, ఎంఆర్సీ సిబ్బంది రవి, నరేష్, దిలీప్, సంతోష్, నరేందర్‌లను శాలువాలు కప్పి, మొక్కలు అందజేసి ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో ట్రాస్మా జిల్లా నాయకుడు ప్రసాద్ పాల్గొన్నారు.