అన్నమయ్య: టీ సుండుపల్లి మండలం ఈడిగపల్లె చెందిన సుగుణమ్మపై కొందరు దాడి చేయడంతో ఆమె తీవ్రంగా గాయపడింది. బాధితురాలి వివరాల ప్రకారం.. రూ.30 లక్షలతో సీసీ రోడ్లు నిర్మాణానికి గ్రామంలోని కొందరు అడ్డువస్తున్నారని కలెక్టర్‌కు ఫిర్యాదు చేసింది. దీంతో ఈశ్వరయ్య అనే వ్యక్తి రాయితో బలంగా తల మీద కొట్టంతో ఆమెకు తల మీద, భుజాలకు గాయాలయ్యాయి. ఆమెను రాయచోటి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
ఆంధ్రప్రదేశ్
జనసేన వీర మహిళ సుగుణమ్మపై దాడి


