హైదరాబాద్: 28°C
తెలంగాణ

మెదక్‌లో షీ టీమ్స్ అవగాహన సదస్సు

MDK: మెదక్ రూరల్ పోలీస్ పరిధిలోని అవుసులపల్లి బస్టాప్ వద్ద షీ టీమ్స్ ఆధ్వర్యంలో మహిళలు, ప్రయాణికులకు ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు. ఇందులో మహిళల రక్షణ కోసం 'T-Safe' యాప్ ప్రాముఖ్యత, షీ టీమ్స్ సేవలతో పాటు సైబర్ నేరాలు, పోక్సో చట్టం, మానవ అక్రమ రవాణా నివారణపై అవగాహన కల్పించారు.