హైదరాబాద్: 28°C
తెలంగాణ

మహిళలకు షీ టీమ్స్‌పై అవగాహన

RR: నందిగామ గ్రామపంచాయతీ కార్యాలయంలో ఫ్యూచర్ సిటీ షీ టీమ్స్ ఆధ్వర్యంలో మహిళలు, గ్రామస్తులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. సర్పంచ్ కొమ్ము కృష్ణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. SI ధర్మియా మాట్లాడుతూ.. బాలికల భద్రతే లక్ష్యమని, వేధింపులకు గురిచేస్తే టోల్‌ఫ్రీ నంబర్‌ 112కు సమాచారం ఇవ్వాలన్నారు. ఆకతాయిలపై కఠిన చర్యలు ఉంటాయన్నారు.