కర్నూలు కలెక్టరేట్‌లో సోమవారం ఆర్టీసీ కండక్టర్ నాగరాజు విషం తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. కర్నూలు సెకండ్ డిపో–2లో పనిచేస్తున్న నాగరాజు.. భార్య, పిల్లలు తనకు దూరంగా ఉండటంపై ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలిపారు. వారు తన వద్దకు రావాలనే ఉద్దేశంతో ఈ చర్యకు పాల్పడినట్లు పేర్కొన్నారు. 108కు సమాచారం ఇవ్వడంతో కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: కలెక్టరేట్‌లో ఆర్టీసీ కండక్టర్ ఆత్మహత్యాయత్నం


