హైదరాబాద్: 28°C
తెలంగాణ

డ్రైనేజీ సమస్య పరిష్కారానికి చర్యలు

SDPT: డ్రైనేజీ సమస్య పరిష్కారానికి చర్యలు చేపడుతున్నట్లు ఆర్‌అండ్‌బీ అధికారి డీఈ వెంకటేశం తెలిపారు. దౌల్తాబాద్ మండల కేంద్రంలో ఏఈ చందుతో కలిసి డ్రైన్లు, డివైడర్ల నిర్మాణానికి అవసరమైన ప్రాంతాలను పరిశీలించి కొలతలు తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామంలో డ్రైనేజీ సమస్యలు తలెత్తకుండా అవసరమైన ప్రాంతాల్లో డ్రైన్ల నిర్మాణానికి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.