SRCL: వేములవాడ జూనియర్ కళాశాల మైదానంలో జరుగుతున్న రాష్ట్రస్థాయి బాలబాలికల కబడ్డీ పోటీలను జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ సోమవారం పరిశీలించారు. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ సహకారంతో జిల్లా కబడ్డీ అసోసియేషన్ ఆధ్వర్యంలో పోటీలు జరుగుతున్నాయి. క్రీడాకారులను పరిచయం చేసుకుని, నిర్వహణపై ఆరా తీశారు. వైస్ ఛైర్మన్ నరాల శేఖర్, ఆర్డీఓ కేఎస్బీ కుమారి పాల్గొన్నారు.
తెలంగాణ
కబడ్డీ పోటీలను పరిశీలించిన కలెక్టర్


