KNR: చొప్పదండి పట్టణంలోని 8వ వార్డులో డ్రెయిన్ నిర్మాణ పనులను మున్సిపల్ చైర్‌పర్సన్ వడ్లూరి సరిత-శ్రీనివాస్ సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. "ప్రజల సౌకర్యమే మా ప్రాధాన్యత, చొప్పదండి అభివృద్ధే మా ప్రధాన లక్ష్యం" అని స్పష్టం చేశారు. పట్టణంలో మౌలిక వసతుల కల్పనకు, ప్రగతికి నిరంతరం కృషి చేస్తున్నామని ఈ సందర్భంగా వివరించారు.
తెలంగాణ
చొప్పదండిలో డ్రెయిన్ పనులు ప్రారంభం


