హైదరాబాద్: 28°C
క్రీడలు

నా బెస్ట్ థెరపీ అదే: రోహిత్ శర్మ

టీమిండియా స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మ 'ఫ్యామిలీ ఫుల్ హౌస్' షోకి హోస్ట్‌గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. ఈ షోలో హిట్‌మ్యాన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. విశ్రాంతి అంటే పూర్తిగా ఖాళీగా ఉండటం కాదన్నాడు. తన ఇద్దరు పిల్లలతో గడపడమే తనకు అసలైన రిలాక్సేషన్ అని తెలిపాడు. తాను ఇంటికి వెళ్లగానే తన పిల్లల వెంటే పరుగెడుతుంటానని, వాళ్లతో సమయం గడపడమంటే ఇష్టమని చెప్పుకొచ్చాడు.