హైదరాబాద్: 28°C
క్రీడలు

ఆసియా క్రీడల్లో సత్తా చాటిన ఆర్మీ యోధుడు

20వ ఆసియా క్రీడల్లో భారత ఆర్మీకి చెందిన సుబేదార్ నరేందర్ బెర్వాల్ సత్తా చాటారు. అద్భుత ప్రదర్శనతో కాంస్య పతకం సాధించి మువ్వన్నెల జెండా రెపరెపలాడించారు. ఈ విజయంపై ఆర్మీ చీఫ్ జనరల్ ధీరజ్ సేథ్, ఇతర అధికారులు నరేందర్‌కు అభినందనలు తెలిపారు. యుద్ధ రంగంలోనే కాకుండా క్రీడల్లోనూ ఆర్మీ యోధులు దేశానికి గర్వకారణంగా నిలుస్తున్నారని ఆర్మీ కొనియాడింది.