హైదరాబాద్: 28°C
వార్తలు

ఎమ్మెల్యే కొలికపూడిపై పీఎస్‌లో ఫిర్యాదు

AP: తిరువూరు టీడీపీ MLA కొలికపూడి శ్రీనివాసరావుపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని సామాజిక సంక్షేమ బోర్డు ఛైర్మన్ వ్యక్తిగత కార్యదర్శి చెరుకూరి కిరణ్ కృష్ణలంక పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. బోర్డు కార్యాలయం వద్ద ఎమ్మెల్యే తన 100 మంది అనుచరులతో ధర్నా చేస్తానని ప్రకటించడంతో పోలీసులకు ఫిర్యాదు అందజేశారు. కార్యాలయం వద్ద ఎలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో కోరారు.