NRPT: దామరగిద్ద మండలం క్యాతన్ పల్లి వద్ద రోడ్డు దుస్థితి ప్రయాణికులకు చుక్కలు చూపిస్తోంది. మద్దూర్, కోస్గి ప్రాంతాలకు వెళ్లే ఈ ప్రధాన మార్గంలో నిత్యం భారీ సంఖ్యలో వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. రోడ్డు పాడవడంతో బైక్ రైడర్లు నిత్యం జారిపడి గాయాలపాలవుతున్నారు. అధికారులు స్పందించి ఈ రహదారిని వెంటనే పునరుద్ధరించాలని స్థానికులు కోరుతున్నారు.
తెలంగాణ
గుంతలమాయంగా రోడ్డు.. ప్రయాణికులకు ఇక్కట్లు


