KMM: అశ్వాపురం మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో రైతు వేదికలో సోమవారం ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీడీవో ముత్యాలరావు, నాయబ్ తహసీల్దార్ సమ్మయ్య ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. వివిధ సమస్యలపై ప్రజలు అందించిన దరఖాస్తులను పరిశీలించి, సంబంధిత శాఖల అధికారులతో మాట్లాడి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.
తెలంగాణ
ప్రజావాణి.. వినతులు స్వీకరించిన అధికారులు


