హైదరాబాద్: 28°C
తెలంగాణ

మాదిగ విద్యార్థుల మహాసభ పోస్టర్ ఆవిష్కరణ

MLG: అక్టోబర్ 6న హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీలో జరగనున్న మాదిగ విద్యార్థుల జాతీయ స్థాయి ప్రతినిధుల మహాసభను విజయవంతం చేయాలని పిలుపునిస్తూ ములుగు అంబేద్కర్ సెంటర్‌లో వాల్ పోస్టర్‌ను ఆవిష్కరించారు. పద్మశ్రీ మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు నిర్వహించిన కార్యక్రమంలో MRPS-MSP ములుగు జిల్లా ఇన్‌ఛార్జ్ చాతాళ్ల రమేష్ మాదిగ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.