VKB: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ మాతా శిశు ఆస్పత్రిలో రోగులకు నాసిరకం, కుళ్లిన కూరగాయలతో భోజనం పెడుతున్నారని సీపీఎం జిల్లా కార్యదర్శి ఆర్.మహిపాల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. భోజనం, పాలు, పండ్లు సరిగ్గా ఇవ్వట్లేదని పలుమార్లు కలెక్టర్‌కు ఫిర్యాదు చేసినా తీరు మారలేదన్నారు. వెంటనే కాంట్రాక్ట్ రద్దు చేసి చర్యలు తీసుకోకుంటే ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు.
తెలంగాణ
ఆస్పత్రిలో కుళ్లిన కూరగాయలతో వంటలు!


