హైదరాబాద్: 28°C
తెలంగాణ

అధ్వానంగా పాఠశాల రహదారి

PDPL: ధర్మారంలోని ప్రభుత్వ ఆదర్శ పాఠశాల రహదారి అధ్వానంగా మారిందని స్థానికులు అంటున్నారు. కొత్తపల్లి-బొమ్మారెడ్డిపల్లి కూడలి మూలమలుపు వద్ద పెద్ద గుంత ఏర్పడటంతో 251 మంది విద్యార్థులు, వాహనదారులు నిత్యం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నందున అధికారులు వెంటనే స్పందించి రోడ్డుకు మరమ్మతులు చేయించాలని వారు కోరుతున్నారు.