హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నూతన డీఎస్పీగా ధనుంజయనాయుడు

SKLM: గూనపాలెంలోని డీఎస్పీ కార్యాలయంలో ఇవాళ నూతన డీఎస్పీ‌గా సీహెచ్ ధనుంజయనాయుడు బాధ్యతలు చేపట్టారు. నేరాల నియంత్రణకు, శాంతిభద్రతల పరిరక్షణకు కృషి చేస్తానని ఆయన అన్నారు. స్థానిక ఎన్నికల దృష్ట్యా సమస్యాత్మక ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెడతామని, యువత మత్తుకు దూరంగా ఉండాలని, సైబర్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు.