హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

FBT యాప్ పేరుతో పల్నాడులో భారీ మోసం

పల్నాడులో FBT (ఫ్యూచర్ బ్యాంక్ టెక్నాలజీ) యాప్ పేరుతో భారీ మోసం జరిగినట్లు బాధితులు ఆరోపిస్తున్నారు. వినుకొండ, నరసరావుపేట, సత్తెనపల్లి ప్రాంతాల్లో సుమారు 650 మంది రూ. 2 కోట్ల వరకు నష్టపోయినట్లు సమాచారం. రూ.18,500 పెట్టుబడికి రోజుకు రూ.638 చెల్లిస్తామని నమ్మించిన నిర్వాహకులు.. గత నెల 1 నుంచి యాప్ పనిచేయకపోవడంతో బాధితులు ఆందోళన చెందుతున్నారు.