హైదరాబాద్: 28°C
తెలంగాణ

శ్రీ కేతకి సంగమేశ్వర స్వామికి హారతి పూజలు

SRD:​ఝరాసంగం శ్రీ కేతకి సంగమేశ్వర ఆలయంలో సోమవారం పార్వతీ సమేత సంగమేశ్వర స్వామివారికి అర్చకులు విశేష పూజలు నిర్వహించారు. భాద్రపద మాసం దశమి తిథి ఇందువాసరే పవిత్ర దినం కావడంతో స్వామివారికి పంచామృత అభిషేకాలు, ప్రత్యేక అర్చనలు జరిపారు. ఉమ్మడి మెదక్ జిల్లా నలుమూలల నుంచి తరలివచ్చిన భక్తులు స్వామివారిని దర్శించుకుని మొక్కుబడులు చెల్లించుకున్నారు.