హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: భూమి కోసం గొడవ.. దంపతులపై దాడి

BDK: లక్ష్మీదేవిపల్లి మండలం సీతారాంపురం తండాలో భూమికి సంబంధించిన వివాదం ఉద్రిక్తతకు దారితీసింది. ఆదివారం రాత్రి భావ్సంగ్ దంపతులపై దాడి జరగడంతో ఇద్దరికీ గాయాలయ్యాయి. స్థానికుల సహాయంతో బాధితులను 108లో కొత్తగూడెం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఘటనపై సమాచారం అందుకున్న ఎస్సై అఖిల దర్యాప్తు ప్రారంభించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.